తెలంగాణలో అనూహ్యంగా పెరుగుతున్న కేసులు
తెలంగాణలో కరోనా కేసులు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. ప్రజలు అజాగ్రత్తతోనే కేసుల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు
తెలంగాణలో కరోనా కేసులు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. ప్రజలు అజాగ్రత్తతోనే కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక్కరోజులో 739 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఎటువంటి మరణాలు సంభవించ లేదు. ఇది కొంత ఊరటనిచ్చే అంశమైనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మాస్క్ లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్లనే కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
మరణాలు లేకున్నా...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,13,120 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 8,04,323 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. రికవరీ రేటు 98.92 శాతం గా ఉండటం మంచిదే అయినా, కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 4,111 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఈ కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు.