నిర్మల్ జిల్లాలో విషాదం.. నీటి కుంటలో పడి ఇద్దరు మృతి

నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది.

Update: 2026-03-30 02:48 GMT

నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడ సమీపంలో గల కుంటలో స్నానానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కైలాష్ , కంటేశ్వర్ లు కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. కుంటలో స్నానానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో...
మద్యం మత్తులో ఉండి కుంటలో ఈతకు వెళ్లారు. కైలాష్ ను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. కంటేశ్వర్ కనిపించకపోవడంతో కుంటలో గాలించగా ఆదివారం ఉదయం మృతదేహం లభ్యమయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Tags:    

Similar News