Telangana : నేడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

నేడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించనందుకు నిరసనలు తెలియజేయనుంది.

Update: 2025-02-03 04:03 GMT

నేడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించనందుకు నిరసనలు తెలియజేయనుంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించడానికి వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియచేయాలని, ఆందోళనలకు దిగాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

కేంద్ర బడ్జెట్ లో మొండి చేయి చూపడంతో...
కేంద్రంలో బడ్జెట్ మొండి చేయి చూపించడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పలు అంశాలను కూడా పట్టించుకోకపోవడాన్నినిరసిస్తూ ఈ ఆందోళనలు చేయనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నిరసనలు తెలియజేయనున్నారు. నిన్న ట్యాంక్ బండ్ పై పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేసి తమ నిరసనను తెలియజేశారు. అన్ని పార్టీలు కలసికట్టుగా ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలని పీసీసీ చీఫ్ పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News