సూర్యాపేటలో కాంగ్రెస్ సభ డిసైడ్ చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ త్వరలోనే సూర్యాపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని సిద్ధమయింది
కాంగ్రెస్ పార్టీ త్వరలోనే సూర్యాపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని సిద్ధమయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ఐదున్నర గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీవర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంతో పాటు ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
ఈ నెలలోనే రెండు ...
ఈ నెలలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఒకటి సూర్యాపేటలో మరొకటి గజ్వేల్ లో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సభలకు ఢిల్లీ నుంచి జాతీయస్థాయి నేతలను పిలవాలని నిర్ణయించారు. మల్లికార్జున ఖర్గే తో పాటు రాహుల్ గాంధీ వంటి వారిని పిలిచి తాము అమలు చేసిన పథకాలను గురించి వివరించాలని నిర్ణయించినట్లు తెలిసింది.