Congress : నేడు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు.. ప్రత్యేక రైలులో
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించాలని నేడు కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించాలని నేడు కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మోదీ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ కు చెందిన బీసీ ప్రతినిధులు ప్రత్యేక రైలులో బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీచీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
ఈ నెల 6వ తేదీన...
ఈ నెల 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఇండికూటమి నేతలతోనూ సమావేశమై పార్లమెంటు సమావేశాల్లో ఈ నెల 5వ తేదీన వాయిదా తీర్మానం ఇచ్చి చర్చించేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమయింది. బుధవారం జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ధర్నాలో పాల్గొననున్నారు. రాష్ట్రపతిని కూడా కలసి వినతిపత్రాన్ని సమర్పించాలని నిర్ణయించారు.