Rahul Gandhi : నేడు తెలంగాణకు రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు

Update: 2024-05-05 02:57 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తొలి సారి తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. నిర్మల్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.

నిర్మల్ జిల్లాలో...
నిర్మల్ లోని క్రషర్ గ్రౌండ్స్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంతో ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కనీసం పథ్నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.


Tags:    

Similar News