ఫోన్ ట్యాపింగ్ పై జగ్గారెడ్డి ఏమన్నారంటే?

పదేళ్ల పాటు ఫోన్లు ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ బలహీనంగా మారిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు

Update: 2025-06-26 07:56 GMT

పదేళ్ల పాటు ఫోన్లు ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ బలహీనంగా మారిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. పదేళ్లలో పరిపాలనపై దృష్టి పెట్టకుండా ఫోన్ల ట్యాపింగ్ పైనే దృష్టి పెట్టారన్నారు. నేరస్తుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన వాళ్లు రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. అన్ని పార్టీల రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ లు చేసి తన ప్రభుత్వంపై అభద్రతభావాన్ని బయటపెట్టుకుందని అన్నారు.

తన ఫోన్ కూడా...
తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్లు తెలిసిందని, ఫోన్ ట్యాపింగ్ చేయడం తద్వారా వారి నడవడికలను తెలుసుకునిరాజకీయంగా నిర్ణయాలు తీసుకునే వారని అర్థమవుతుందన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందిఫోన్ ట్యాపింగ్ మాత్రమేనని, అభివృద్ధి కాదని ఆయన అన్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


Tags:    

Similar News