నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ
నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ ప్రారంభించనుంది.
నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ ప్రారంభించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ఈ విచారణ చేపట్టనున్నారు. గత కొద్ది రోజులు గా ఈ విచారణ చేపట్టింది. ఇప్పటికే అధికారులతో పాటు మరికొందరు కీలకమైన వారిని విచారించారు.
కీలక నేతలకు నోటీసులు...
అయితే నేటి నుంచి మలి దశ విచారణలో మాత్రం కీలకమైన వారికి నోటీసులు అందచేసి వారిని విచారించే అవకాశముందని తెలిసింది. ప్రాజెక్టు సమయంలో తీసుకున్న నిర్ణయాలు, అవకతవకల ఆరోపణలపై విచారించనుంది. ఈ నెలాఖరుకు జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ గడువు ముగియనుంది. అయితే మరోసారి ప్రభుత్వం కమిషన్ గడువు పెంచే అవకాశముంది.