Kalvakuntla Kavitha : ఇదేదో పెద్ద డ్రామాలా ఉంది భయ్యా.. అధికారంలో వాటా కోసమేనా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆఫ్ ది రికార్డులో చేస్తున్న కామెంట్స్, తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పెద్ద డ్రామాయే నడుస్తుందని అనుకోవాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆఫ్ ది రికార్డులో చేస్తున్న కామెంట్స్, తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పెద్ద డ్రామాయే నడుస్తుందని అనుకోవాలి. ఎందుకంటే కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ లో చేరేందుకు అవకాశం కనిపించడం లేదు. రాజీవ్ గాంధీ పేరు ఎందుకు పెడుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేసి కవిత ఆ ప్రచారానికి తానే తెరదింపేశారు. మరొక వైపు బీజేపీపైన కూడా విమర్శలు చేస్తూ ఆ పార్టీకి తాము దూరమన్న సంకేతాలను బలంగానే తెలంగాణ సమాజానికి పంపగలగారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఈగవాలనివ్వబోమంటూ కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కల్వకుంట్ల కుటుంబంలో ఒక స్క్రిప్ట్ ప్రకారమే కవిత నడుచుకంటున్నారన్నది స్పష్టమవుతుంది.
పార్టీ నుంచి...
కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ ఆశీస్సులతో జాగృతిని ఏర్పాటు చేయడం జరిగిందని అనడంతో పాటు ఆయన కు కాళేశ్వరం కమిషన్ కు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా జూన్ నెల 4వతేదీన మహా ధర్నాకు కవిత పిలుపు నిచ్చారంటే బీఆర్ఎస్ నుంచి ఆమె వైదొలడం అనేది జరగని పని.ఆమె బీఆర్ఎస్ లో కొనసాగుతూనే ఏదో ఆశిస్తున్నారని, అందుకోసం గ్రౌండ్ క్లియర్ చేసుకోవడానికి, ఈసారి అధికారంలోకి బీఆర్ఎస్ వస్తే మంత్రి పదవి దక్కించుకోవడంలో భాగంగా ఆడుతున్న నాటకమని కొందరు సోషల్ మీడియాలో అప్పుడే కామెంట్స్ మొదలు పెట్టారు. కేటీఆర్ తో సమాన ప్రాతినిధ్యం పార్టీలో దక్కాలంటే ఏదో ఒకటి చేయాలని ఫ్యామిలీ దర్శకత్వంలోనే కవిత నడుస్తున్నట్లు అర్థమవుతుంది.
జాగృతి పేరిట...
అందుకే తెలంగాణ జాగృతి పేరిట కల్వకుంట్ల కవిత కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా ఆమె కార్యక్రమాలను చేపట్టబోతున్నారన్న మాట. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ పరంగా చూసుకుంటే, తాను జాగృతి పేరిట జనంలోకి వెళ్లేందుకు మార్గాన్ని కల్వకుంట్ల కవిత లైన్ క్లియర్ చేసుకున్నట్లు కనపడుతుంది. రేవంత్ సర్కార్ పై పోరాటానికి కూడా కవిత సిద్ధమవుతున్నారు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలంటూ జాగృతి తరుపున ఆందోళనకు దిగనున్నారు. అందుకే అందరూ భావించినట్లుగా ఇది కారు పార్టీలో తిరుగుబాటు కాదని, అధికార బాట అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకు...
గోదావరి, కావేరీ అనుసంధానం పేరు మీద తెలంగాణ నీటిని చంద్రబాబు తరలించుకుపోతున్నారని కూడా కవిత ఫైర్ అయ్యారు. అంటే సెంటిమెంట్ తో ముందుకు వెళ్లి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ఆమె ప్రయత్నాల్లో భాగమని అంటున్నారు. చంద్రబాబు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా దానిపై ఆందోళనలు కూడా చేయడానికి కవిత సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ లోనే రెండు వేర్వేరు నాయకత్వాలతో జనం ముందుకు వెళ్లనున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను తాము అందిపుచ్చుకునేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండే ఏర్పడే ఓటు బ్యాంకు బీజేపీ వైపు వెళ్లపోకుండా అంతా తమ వైపునకు తిప్పుకునేందుకు ఈ రకమైన వ్యూహాలతో కవిత ముందుకు వెళుతున్నారన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.