కలెక్టర్ భార్యకు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం
తెలంగాణ రాష్ట్రంలో ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. వారిలో ప్రభుత్వ అధికారుల భార్యలు కూడా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ తన సతీమణి శ్రద్ధకు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించారు.
ఆమెకు నెలలు నిండటంతో పాల్వంచలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందే సేవలపై ప్రజల్లో నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా అని కలెక్టర్ తెలిపారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు అన్ని పరీక్షల్ని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే చేయించారు. ఇక్కడి వైద్యులు అందజేసిన మందులనే వాడినట్లు తెలిపారు.