కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం

కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది

Update: 2025-05-29 04:14 GMT

కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ భార్య శ్రద్ధను ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేర్చారు. దీంతో కలెక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రద్ధకు తొమ్మిది నెలలు రావడంతో పాల్వంచలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చించారు ఆమె అక్కడ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

మగబిడ్డకు జన్మనిచ్చి...
జిల్లా కలెక్టర్ అయి ఉండి ప్రయివేటు ఆసుపత్రుల వైపు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రికే రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన ప్రజలకు కలెక్టర్ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాలన్న ఉద్దేశ్యంతోనే తాను తన భార్య కాన్పును ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించానని కలెక్టర్ తెలిపారు.


Tags:    

Similar News