హైదరాబాద్ ను వణికిస్తున్న చలిగాలులు

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

Update: 2022-01-28 01:39 GMT

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో రెండు రోజులు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ చెప్పింది. పశ్చిమ ప్రాంతం నుంచి వస్తున్న గాలుల వల్ల రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

మరో రెండు రోజులు.....
ఈ చలిగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లనూ చలిగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశముంది. హైదరాబాద్ లోని సరూర్ నగర్, హయత్ నగర్ర, ఉప్పల్, ఎల్పీ నగర్, ఫలక్ నుమా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పది డిగ్రీల వరకూ నమోదయ్యే వరకూ అవకాశముంది.


Tags:    

Similar News