క్లియరెన్స్ చేసుకోకుంటే ఇక అంతే
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన చలాన్ల క్లియరెన్స్ రాయితీకి ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన చలాన్ల క్లియరెన్స్ రాయితీకి ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు అవకాశం కల్పించారు. మొత్తం దాదాపు 600 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో వసూలు కావాల్సి ఉండగా, భారీ రాయితీలు ప్రకటించడంతో రెండు వందల నుంచి 250 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో వసూలవుతాయని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేశారు.
నాలుగు రోజులే....
ఇప్పటి వరకూ 190 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో వసూలయింది. ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు జంటనగరాల వాహనదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటి వరకూ 1.05 కోట్ల చలాన్లకు చెల్లింపులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ నాలుగురోజుల్లో మిగిలిన వారు కూడా ట్రాఫిక్ చలాన్లను క్లియరెన్స్ చేసుకోవాలని పోలీసుల అధికారులు సూచిస్తున్నారు.