Revanth Reddy : నేడు రేవంత్ ప్రజాదర్బార్
ముఖ్యమంత్రి రేవంత్ నేడు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఉదయం పదిగంటలకు ప్రగతి భవన్ లో ప్రజాదర్బార్ ను నిర్వహిస్తారు.
Rythu bandhu
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి నేడు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఉదయం పదిగంటలకు ప్రగతి భవన్ లో ఆయన ప్రజాదర్బార్ ను నిర్వహిస్తారు. ప్రగతి భవన్ కు జ్యోతిరావు పూలే భవన్ గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ప్రజాదర్బార్ జరుగుతుందని, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రతి శుక్రవారం...
ప్రజా దర్బార్ లో ముఖ్యమంత్రి నేరుగా ప్రజల వద్ద నుంచి నేరుగా వినతులను స్వీకరించి వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించనున్నారు. ప్రతి శుక్రవారం ఇకపై ప్రజా దర్బార్ నిర్వహించాలని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు.