Revanth Reddy : నేడు ముఖ్యమంత్రి రేవంత్ ఏరియల్ సర్వే

తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్స్ తో పాటు భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు.

Update: 2025-08-28 02:32 GMT

తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్స్ తో పాటు భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈరోజు కూడా వర్షాలు పడే అవకాశమున్నందున జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఆదేశించారు.

భారీ వర్షాలు కురిసిన...
ప్రధానంగా నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు అవసరమైతే ఎస్డీఆర్ఎప్ , ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించానలి ఆదేశించారు. వరద నీటిలో చిక్కుకున్న రూప్ సింగ్ తండా, వాడి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి మూడు లక్షల క్యూసెక్కులను, నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి లక్షా 90 వేలక్యూసెక్కుల జలాలను వదులుతున్నందున, దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు.


Tags:    

Similar News