Revanth Reddy : బనకచర్ల ఎలా కడతారు? దానిని ఆపేయండి
కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రాజెక్టులకు పూర్తి స్థాయి నీటి కేటాయింపులు జరిగిన తర్వాతనే గోదావరిలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతివ్వాలని కోరారు. ఢిల్లీలో జలవనరుల శాఖ మంత్రిని కలిసిన ఆయన ఏపీ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. కేంద్రం జోక్యం చేసుకుని కృష్ణా, గోదావరి నదుల్లో మిగులు జలాలపై ప్రాజెక్టులు కట్టేందుకు అనుమతి నిరాకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.
కృష్ణా బేసిన్ లో...
కృష్ణా బేసిన్ లో ఎక్కువ నీటిని ఏపీ తీసుకుంటుందని, దీనిని అడ్డుకోవాలని తాము కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కృష్ణా బేసిన్ లో ఏపీ ఎక్కువ నీటిని తీసుకుంటుందని, అలా తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని తాము కోరినట్లు ఆయన తెలిపారు. గోదావరి ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు తెలంగాణకు జరగలేదని, తమకు కేటాయింపులు జరిగిన తర్వాత మాత్రమే ఏపీ ప్రాజెక్టులకు అనుమతివ్వాలని ఆయన కోరినట్లు తెలిపారు. సమస్యకు పరిష్కారం కావాలంటే వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని తాముకోరినట్లు ఆయన తెలిపారు.