Revanth Reddy :హైదరాబాద్ లో మరో నగరం.. దేశంలోనే అత్యుత్తమ సిటీ

హైదరాబాద్ నగరంలో మరో నగరం నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్లాన్ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

Update: 2025-11-18 07:54 GMT

హైదరాబాద్ నగరంలో మరో నగరం నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్లాన్ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీగా దానిని ముప్ఫయి వేల ఎకరాల్లో నిర్మిస్తున్నామని తెలిపారు. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల అర్బన్ డెవలెప్ మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ ఆయన మాట్లాడారు. ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇందుకోసం 2047 విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేశామని చెప్పారు.

భారత్ ఫ్యూచర్ సిటీ...
2047 నాటికి ముప్పయి ట్రిలియన్ ఎకానమి టార్గెట్ గా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ వాతావరణ పరంగా, అన్ని రకాలుగా అనుకూలమైన నగరమని తెలిపారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన వంటివి చేసి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తమకు పోటీ ఇతర రాష్ట్రాలు కాదని, టోక్యో వంటి నగరాలు మాత్రమేనని రేవంత్ రెడ్డి అన్నారు. సింగపూర్, దుబాయ్ లతో పోటీ పడే విధంగా హైదరాబాద్ ను రూపొందించే ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.


Tags:    

Similar News