Revanth Reddy : చిట్ చాట్ లో సీఎం.. కీలక వ్యాఖ్యలు
అధికారుల నియామకాల్లో పైరవీలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
Revanth reddy
అధికారుల నియామకాల్లో పైరవీలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన మీడియా చిట్ చాట్ లో పలు విషయాలపై స్పందించారు. అలాగే కొత్త భవనాల నిర్మాణాలను కూడా చేపట్టబోమని తెలిపారు. గత ప్రభుత్వం పన్నెండు నుంచి పదమూడు గంటలు మాత్రమే విద్యుత్తు ఇచ్చిందని, తమ ప్రభుత్వం మాత్రం ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు ఇస్తుందని ఆయన తెలిపారు. ప్రజా భవన్ లో ఉన్న కార్యాలయాలను తాము ఉపయోగించుకుంటామని, అంతే తప్ప కొత్త భవనాలను నిర్మించే ఆలోచన చేయబోమని ఆయన చెప్పారు.
రెండూ కలసి ఉండాలని...
అసెంబ్లీ, శాసనమండలి కలసి ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. మర్రి చెన్నారెడ్డి అభివృద్ధి సంస్థలోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకుంటామని చెప్పారు. శాసనసభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని చెప్పారు. అన్ని అంశాలతో అందరితో చర్చించి అన్నింటిపైనా శ్వేతపత్రాలను విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. సీపీలు ఎవరూ తనను పోస్టింగ్ ఇవ్వాలని కోరలేదన్నారు. రేపటి బీఏసీ సమావేశంలో అజెండా చర్చించి సమావేశాలను ఎప్పటి వరకూ నిర్వహించాలో నిర్ణయిస్తామని తెలిపారు.