రాహుల్ సిప్లిగంజ్ కు కోటి బహుమతి

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయలను బహుమతిని ప్రకటించారు

Update: 2025-07-20 07:14 GMT

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయలను బహుమతిని ప్రకటించారు. ఎన్నికలకు ముందు తెలంగాణకు చెందిన రాహుల్ సిప్లిగంజ్ కు రేవంత్ రెడ్డి పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కష్టపడి తెలంగాణలో సినీరంగంలోకి పైకి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ నేటి యువతకు ఆదర్శమని రేవంత్ రెడ్డి అన్నారు.

బోనాల సందర్భంగా...
అయితే ఆషాఢమాసం బోనాల సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోటి రూపాయలు నజరానా ఇస్తామన్న మాట నిలబెట్టుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. నేటి యువత రాహుల్ సిప్లిగంజ్ ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదిగేందుకే ఆయనకు ఈ కోటి రూపాయల నజరానాను ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.


Tags:    

Similar News