ధర్నా లో కేసీఆర్.. దిగిరాకపోతే?

తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాకు దిగారు.

Update: 2021-11-18 06:58 GMT

తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాకు దిగారు. ఇందిరా పార్కు వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి ఆయన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యతిరేకతతో ఉందని కేసీఆర్ అన్నారు. కేంద్రంపై తమ యుద్ధం ఆగదని స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్ లో రైతుల కోసం, రాష్ట్రం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కేసీఆర్ తెలిపారు.

పోరాటం ఆగదు...
పంజాబ్ లో కొంటున్నట్లు తెలంగాణలో ధాన్యాన్ని ఎందుకు కొనరని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి లేఖ రాసినా ఫలితం లేదన్నారు. కేంద్రం రైతు ప్రయోజనాల కోసం దిగిరావాల్సిందేనని కేసీఆర్ అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని కేసీఆర్ స్పష్టం చేశారు.


Tags:    

Similar News