KCR : నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చండీయాగం
ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో హోం నిర్వహించనున్నారు. కేసీఆర్ కుటుంబం హోమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో హోం నిర్వహించనున్నారు. కేసీఆర్ కుటుంబం హోమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారని చెబుతున్నారు. వరసగా నమోదవుతున్న కేసులు, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐకి కేసు అప్పగించడం, ఆరోగ్య సమస్యలు వంటి కారణాలతో చండీ యాగం నేడు నిర్వహించనున్నారు.
ఉదయం పదకొండు గంటలకు...
అయితే ఎప్పటి నుంచో ఈ చండీ యాగం చేయించాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ ఇప్పటికే చండీయాగంలో పాల్గొనేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఐదు రోజులుగా కేటీఆర్ తో పాటు కొందరు మంత్రులు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉండి యాగం ఏర్పాట్లను చేస్తున్నారు.