ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చండీయాగం

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు

Update: 2023-01-10 04:34 GMT

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఏపీ, తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారని తెలిసింది. అందుకే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యగాన్ని నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో చండీయాగాన్ని వేద పండితులు నిర్వహిస్తున్నారు.

ముగింపు రోజు...
ఈ చండీయాగానికి తెలంగాణకు చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవిందకుమార్ గౌడ్ లు చండీ యాగానికి హాజరయ్యారు. చండీయాగం ముగింపు రోజున పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News