Telangana : గుడ్ న్యూస్.. తెలంగాణ రైతులకు ఈరోజు నుంచే

తెలంగాణ రైతులకు కేంద్ర ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతు బంధు పథకం చెల్లింపులకు ఎన్నికల కమిషన్ అనుమతించింది

Update: 2023-11-25 03:26 GMT

తెలంగాణ కు చెందిన రైతులకు కేంద్ర ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతు బంధు పథకం చెల్లింపులకు ఎన్నికల కమిషన్ అనుమతించింది. ఈ నెల 28వ తేదీ వరకూ రైతుల ఖాతాల్లో రైతు బంధు సొమ్ములను జమ చేయవచ్చని పేర్కొంది. ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రైతు బంధు పథకం నిధులను ప్రస్తుతానికి నిలిపేయాలని విపక్షాలు, వారికి సమయంలోపు కేటాయించాలని పాత పథకమేనని అధికార పక్షం వాదిస్తూ వస్తుంది.

గ్రీన్ సిగ్నల్....
దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ రైతు బంధు పథకం కింద నిధులను జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో సీజన్ కు ఐదు వేల చొప్పున ఎకరాకు రైతు బంధు కింద పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ సొమ్ములు వస్తాయా? రావా? అన్న సందిగ్దతకు ఎన్నికల సంఘం తెరదించింది. అయితే ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకే నిధులు జమచేయడానికి అనుమతించింది. 30 ఎన్నికలు ఉన్నందున పోలింగ్ ముగిసేంత వరకూ నిధులు జమ చేయవద్దని ఆదేశాల్లో పేర్కొంది.


Tags:    

Similar News