Telangana : ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలివే

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈనెల 16వతేదీన జరగనుంది

Update: 2025-10-14 14:14 GMT

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈనెల 16వతేదీన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో లో కీలకం అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల కోటా అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై మంత్రివర్గం చర్చించనుంది. పంచాయితీ ఎన్నికలు, జీవో 9పై హైకోర్టు స్టే విధించిన క్రమంలో ఈ సమావేశానికి ప్రాధాన్యతను సంతరించుకుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల కోటాపై సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది మంత్రి వర్గంలో చర్చించే అవకాశం ఉంది.దీంతో పాటు రాష్ట్రంలో వరి, పత్తి కొనుగోలు సెంటర్లకు సంబంధించిన అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కూడా క్యాబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News