BRS : నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం

నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు

Update: 2025-03-11 01:52 GMT

నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. బుధవారం నుంచి తెలంగాణ శాసనసభ ప్రారంభం అవతున్న నేపథ్యంలో నేడు శాసనసభ పక్ష సమావేశం తెలంగాణ భవన్ లో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

బడ్జెట్ సమావేశాల్లో...
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బిల్లులు వస్తున్నాయి కాబట్టి దానిపై చర్చల్లో పాల్గొని అందులో లోటు పాట్లను వివరించాలని నేతలకు కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవసరమైనకసరత్తులు చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించనున్నారు.


Tags:    

Similar News