KTR : తెలంగాణ బ్రూ ట్యాక్స్ .. దెబ్బకు కంపెనీలన్నీ పోతున్నాయ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు

Update: 2024-05-25 07:53 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో BRU ట్యాక్స్ అమలవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ B అంటే భట్టి అని.. R అంటే రేవంత్ కానీ, రాహుల్ కానీ, U అంటే ఉత్తమ్ ట్యాక్స్ ను అమలు చేస్తున్నారన్నారు. ఈ BRU ట్యాక్స్ దెబ్బకు తెలంగాణలో పరిశ్రమలన్నీ రాకుండా పోతున్నాయన్నారు. ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లే అవకాశముందని ఆయన తెలిపారు. కొత్త పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకపోగా BRU ట్యాక్స్ ను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తుండటంతో కంపెనీలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు.

తమ హయాంలో...
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదన్నారు. తమ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను ఈసందర్భంగా ఆయన తెలిపారు. గత పదేళ్లలో ఉపాధి కల్పన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తాము ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చినట్లు చూపించుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా యువత ఈ పాలనపై తిరగబడాలని పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News