KTR : రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

Update: 2025-11-05 13:08 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధికి చర్చకు సిద్ధమా అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ సెంటర్, అసెంబ్లీ, గాంధీభవన్ ఎక్కడకు రమ్మన్నా వస్తానని కేటీఆర్ అన్నారు. ఎక్కడకు రమ్మన్నా వస్తానని రేవంత్ తనతో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

లైడిక్టర్ పరీక్షలకు...
తనపై ఏసీబీ కేసులున్నాయని, రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసులున్నాయని, లైడిటిక్టర్ పరీక్షలకు సిద్ధమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి భయంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. హైదరాబాద్ అభివృద్ధిపై తాను చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమని కేటీఆర్ అన్నారు. ఆరోపణలు కాదని, వాస్తవాలు ప్రజలకు చెప్పాలని అన్నారు.


Tags:    

Similar News