ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లిన కేటీఆర్

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.

Update: 2025-06-16 05:29 GMT

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. పది గంటల ముప్ఫయి నిమిషాలకు ఆయన తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఏసీబీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ అడ్వకేట్ జనర్ల్ రామచందర్ రావు కూడా ఉన్నారు. ఆయన కూడా విచారణకు కేటీఆర్ తో కలసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు.

న్యాయవాది వెంట రాగా...
గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు ఆయన వెంట న్యాయవాదిని పోలీసులు అనుమతించారు. ఏసీబీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించలేదు, కిలో మీటర్ దూరం నుంచే బ్యారికేడ్లను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను ఏసీబీ కార్యాలయం వద్దకు రానివ్వకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. అంతకు ముందు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.


Tags:    

Similar News