Telangana : నేడు బీఆర్ఎస్ నిరనసనలు
నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపనుంది
నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపనుంది. శాసనసభ నుంచి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టింది. జగదీశ్ రెడ్డిని నిన్న శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని నిర్ణయించారు.
జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై...
స్పీకర్ గడ్డం ప్రసాదరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జగదీశ్ రెడ్డిని శాసనసభ బడ్జెట్ సమావేశాలన్ని రోజులు సస్పెండ్ చేస్తూ నిన్న సభ నిర్ణయించింది. అధ్యక్ష స్థానం గురించి అమర్యాదకరంగా మాట్లాడారని జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే జగదీశ్ రెడ్డి చేసిన తప్పు ఏమీ లేకపోయినా కక్ష సాధింపుతోనే సస్పెన్షన్ కు పాల్పడ్డారంటూ ఈ నిరసనలను బీఆర్ఎస్ చేపట్టింది.