BRS : నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం

బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నేడు తెలంగాణ భవన్ లో జరగనుంది

Update: 2025-02-19 02:05 GMT

బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నేడు తెలంగాణ భవన్ లో జరగనుంది. ఈ సమావేశఆనికి పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ నేడు రాజకీయ కార్యాచరణ కోసం ఈ కీలక సమావేశం నిర్వహిస్తుంది. పార్టీ 25వ వసంతంలోకి అడుగు పెట్టబోతుంది. 2001 ఏప్రిల్ 27వ తేదీన నాటి టీఆర్ఎస్ ను కేసీఆర్ ప్రారంభించారు. వచ్చే ఏప్రిల్ 27 నాటికి ఇరవై ఐదేళ్లవుతుంది. ఈ సందర్భంగా కేసీఆర్ చేసే ప్రసంగంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

నేతలకు దిశానిర్దేశం...
ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ నిర్మాణంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూడా నేడు కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణ భవన్ కు వస్తున్న కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News