Kalvakuntla Kavitha : కవిత 72 గంటల నిరాహార దీక్ష
72 గంటల నిరాహారదీక్షకు దిగుతున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు
నిరాహారదీక్షకు దిగుతున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలని ఆగస్టు 4,5, 6 తేదీల్లో 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు కవిత తెలిపారు. కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీ బిడ్డలకు అండగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా తాను ఈ నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు.
బీసీ బిల్లు అమలు కోసం...
బీసీ బిల్లు అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా తన దీక్ష కొనసాగుతుందని కవిత తెలిపారు. అన్ని పార్టీలతో ప్రభుత్వం వెంటనే అఖిల పక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ తలపెట్టిన ఆందోళనలు కేవలం బీహార్ ఎన్నికలకోసమేనన్న కవిత బీసీ బిల్లు అమలు విషయంలో చేయాల్సింది చేయకుండా సాగదీత ధోరణిని అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.