Kalvakuntla Kavitha : సస్పెన్షనా? షోకాజ్ నోటీసా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది

Update: 2025-09-02 07:30 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి వరకు కేసీఆర్ తో నేతలు సమావేశమై చర్చించారు. కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందిపెట్టేలా ఉన్నాయన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమయినట్లు తెలిసింది. అయితే కవితకు షోకాజ్ నోటీసు ఇస్తారా లేక సస్పెండ్ చేస్తారా? అన్నది కేసీఆర్ నిర్ణయానికే వదిలేసినట్లు సమాచారం.

క్రమశిక్షణ సంఘం లేకపోవడంతో...
బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం మనుగడలో లేకపోవడంతో షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశంలేదంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా లేఖ ద్వారానే ఇప్పటివరకు పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ వచ్చారు. నిన్న ఫామ్ హౌస్ సమావేశానికి హాజరైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రావడంతో నోటీసులు ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. కల్వకుంట్ల కవితపై తదుపరి చర్యలు ఏం ఉంటాయన్న దానిపై పార్టీ క్యాడర్ ఆసక్తిగా గమనిస్తుంది.


Tags:    

Similar News