కవిత సంచలన నిర్ణయం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. జులై 17వ తేదీన రైల్ రోకో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించి పార్లమెంటుకు పంపినా ఇప్పటి వరకూ ఆమోదించకపోవడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.
జులై 17న రైల్ రోకో...
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం జులై 17న రైల్ రోకో చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందుతుందని అన్నారు. ఈ మేరకు మెదక్ లో నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను ఆమోదించాలని వత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.