పసుపు బోర్డు ఘనత మాదే : కవిత
పసుపు బోర్డు పోరాటం ప్రారంభించిందే తామేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు
పసుపు బోర్డు పోరాటం ప్రారంభించిందే తామేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ వెకిలిమాటలు మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే స్పైసెస్ బోర్డు ఏర్పాటైందని కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. పసుపు రైతుల కోసం త్రిముఖ వ్యూహం ఉండాలని కవిత అభిప్రాయపడ్డారు.
మద్దతు ధరను కల్పించాలంటూ...
పసుపు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన వెంటనే సరిపోదని, అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు, చర్యలు కూడా తీసుకోవాలని కవిత కోరారు. తాము ఎన్నో ఏళ్ల నుంచి పసుపు బోర్డు కోసం చేసిన ప్రయత్నాలు నేడు ఫలించాయని ఆమె అన్నారు. అంతే తప్ప అది అరవింద్ గొప్పదనం ఏమీ కాదని అన్నారు.