ఎయిర్ పోర్టులోనే కవిత వ్యాఖ్యలపై స్పందించిన హరీశ్ రావు

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న హరీష్‌ రావు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై స్పందించారు

Update: 2025-09-06 03:18 GMT

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న హరీష్‌ రావు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై స్పందించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని, తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసునని తెలిపారు. కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

వారి విజ్ఞతకే వదిలేస్తున్నా...
ఆ వ్యాఖ్యలనే వారు ప్రస్తావించారని హరీశ్ రావు అన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. గత పదేళ్లుగా కేసీఆర్ నిర్మించిన వ్యవస్థను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారు ఎవరికి లబ్ది చేయాలనుకుంటున్నారో వారికే తెలియాలన్నారు.


Tags:    

Similar News