హైకోర్టులో హరీశ్ రావు హౌస్ మోషన్ పిటీషన్
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు హౌస్ మోషన్ పిటీషన్ వేశారు
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు హౌస్ మోషన్ పిటీషన్ వేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టవద్దని పిటీషన్ లో కోరారు. తాము కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే భయం ఎందుకని హరీశ్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టవద్దని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై...
అసెంబ్లీలో ప్రభుత్వం కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టవద్దని, తమకు సరైన సమయం ఇవ్వకుండా గత ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంలో ఉందని హరీశ్ రావు అన్నారు. తాము కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని గంటలయినా.. ఎన్ని రోజులయినా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని, తమకు కూడా సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అనుమతించాలని డిమాండ్ చేశారు