Telangana : నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ కు నిరసనగా నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది

Update: 2024-03-16 03:32 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ కు నిరసనగా నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ధర్నాలు, నిరసనలు చేపట్టాలని పిలుపు నిచ్చింది. ఈ కార్యక్రమాలకు పార్టీ నేతలందరూ హాజరు కావాలని అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

అక్రమ అరెస్ట్ అంటూ...
లోక్‌సభ ఎన్నికల వేళ తమ పార్టీ నేతను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈరోజు జరిగే నిరసన కార్యక్రమాల్లో మహిళలు, పార్టీ నేతలు పాల్గొనాలని పార్టీ పిలుపు నిచ్చింది. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈరోజు జరిగే నిరసన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును చేపట్టారు.


Tags:    

Similar News