Etala Rajender : ఈటల సంచలన వ్యాఖ్యలు.. హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తా
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని అన్నారు
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని అన్నారు. హుజారాబాద్ నియోజకవర్గంలో ఆయన మాట్లడుతూ తనపై కుట్రలు చేసిన వారిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తాను బీజేపీలోకి వచ్చిన తర్వాతనే మొన్న జరిగిన పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల్లో యాభై వేల మెజారిటీ బీజేపీకి వచ్చిందని ఈటల రాజేందర్ తెలిపారు.
నేను వచ్చిన తర్వాతనే...
నేను రాకముందు ఎంత మెజారిటీ వచ్చిందో తెలుసుకోవాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ బీజేపీకి భారీ మెజారిటీ వచ్చిందని ఈటల రాజేందర్ తెలిపారు. సర్పంచ్ లకు బీఫారాలు అవసరం లేదని, మనోళ్లను పోటీకి నిలబెడదామని ఈటల రాజేందర్ తెలిపారు. హుజూరాబాద్ లో ప్రతి వార్డు మెంబర్, గ్రామపంచాయతీ సర్పంచ్ మనోళ్లు ఉంటారన్నారు. తనపే దుష్ఫ్రచారం చేస్తున్న వారిది కురచ మనస్తత్వం అని ఈటల రాజేందర్ అన్నారు.