దెబ్బ మీద దెబ్బ‌.. బీజేపీకి షాకిచ్చిన మ‌రో నేత‌

రాష్ట్రంలో బీజేపీకి మ‌రో షాక్ త‌గిలింది. రామగుండం నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు

Update: 2023-08-19 04:20 GMT

రాష్ట్రంలో బీజేపీకి మ‌రో షాక్ త‌గిలింది. రామగుండం నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేర‌కు శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయిన కౌశిక్ హరి పార్టీలో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. 2009లో ప్రజా రాజ్యం నుంచి పోటీ చేసిన కౌశిక్ హరి.. కేవలం 1200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. త్వరలోనే రామగుండంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కౌశిక్ హరితో సహా పలువురు బీజేపీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నారు.

ఇదిలావుంటే ఇటీవ‌ల వ‌రుస‌గా బీజేపీకి షాకులు త‌గులుతున్నాయి. బండి సంజ‌య్ అధ్య‌క్ష మార్పు త‌ర్వాత చాలా ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. క‌రుడుగ‌ట్టిన‌ తెలంగాణ ఉద్య‌మకారుడు జిల్లా బాల‌కృష్ణా రెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. మ‌రో ఉద్య‌మ‌కారుడు, మాజీమంత్రి చంద్ర‌శేఖ‌ర్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత ఆర్మూర్ నియోజ‌కవ‌ర్గ ఇంఛార్జ్‌, బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడు ప్రొద్దుటూరి విన‌య్ కుమార్ రెడ్డి పార్టీ అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, రాజ‌కీయాలు భ‌రించ‌లేక పార్టీని వీడుతున్నానంటూ లేఖ ద్వారా రాజీనామా ప్ర‌క‌టించారు. గ‌త కొంత కాలం క్రితం వ‌ర‌కూ బీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్న‌యం తామే అని చెప్పుకున్న బీజేపీ.. గ్రాఫ్ ప‌డిపోతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.


Tags:    

Similar News