వారిపై బీజేపీ హైకమాండ్ సీరియస్.. యాక్షన్ షురూ

తెలంగాణలో బీజేపీ అసమ్మతి నేతలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ వీరి అసంతృప్త సమావేశాలపై ఆగ్రహంగా ఉంది

Update: 2022-02-23 05:50 GMT

తెలంగాణలో బీజేపీ అసమ్మతి నేతలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ వీరి అసంతృప్త సమావేశాలపై గుర్రుగా ఉంది. వీరిపై చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. ఒకటి రెండు రోజుల్లో వీరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అసంతృప్తి నేతల్లో ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా.....
పార్టీ రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా గుజ్జుల కరుణాకర్ రెడ్డి, సుగుణాకర్ రావు, రాములు, వెంకటరమణి లు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఇందులో రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకున్నారు. గతంలోనూ కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వీరు ఇలాగే వ్యవహరించారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వీరిలో గుజ్జుల కరుణాకర్ రెడ్డి, సుగుణాకర్ రావులపై వేటు వేసే అవకాశముందని తెలుస్తోంది.


Tags:    

Similar News