బర్డ్ ఫ్లూ భయం పోయినట్లే.. పెరిగిన చికెన్ అమ్మకాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తొలిగినట్లే. ఆదివారం చికెన్ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి
రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తొలిగినట్లే. ఆదివారం చికెన్ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రభుత్వం ఈ వ్యాధిపై అవగాహన కల్పించడంలో సక్సెస్ అయింది. ఆదివారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆదివారం కావడంతో ఎక్కువ మంది చికెన్ దుకాణాలకు క్యూ కట్టారు. నిన్న మొన్నటి వరకూ బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ తినాలంటేనే భయపడిపోయిన ప్రజలు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. దీంతో చికెన్ ధరలను కూడా వ్యాపారులు పెంచేశారు.
చికెన్ మేళాలతో...
ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెండు రాష్ట్రాల్లో చికెన్ మేళాలను నిర్వహించి ఉచితంగా చికెన్ పదార్థాలను పంపిణీ చేయడంతో ప్రజలలో ఆ భయం పోయిందనే చెప్పాలి. అందుకే గత కొద్ది రోజుల నుంచి మటన్, చేపలు, రొయ్యల అమ్మకాలు పెరిగాయి. తాజాగా బర్డ్ ఫ్లూ భయం పోవడంతో చికెన్ దుకాణాలు తిరిగి కళకళలాడుతున్నాయి.