KTR : అక్టోబర్ లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక

భారతీయ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్ లో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు

Update: 2025-04-19 07:52 GMT

భారతీయ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్ లో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నేతలతో సమావేశమైన ఆయన పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు, ఈనెల 27న వరంగల్ లో జరిగే సభపై దిశానిర్దేశం చేశారు. ఆ సభ తర్వాత కొత్తగా పార్టీ సభ్యత్వాలు తీసుకుంటామని, ఇకపై డిజిటల్ సభ్యత్వాలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు.

ప్రభుత్వవైఫల్యాలను...
అన్ని విషయాలపై అవగాహనతో మాట్లాడగలిగేలా కార్య కర్తలకు త్వరలో శిక్షణ ఇస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయాలని కేటీఆర్ నేతలకు తెలిపారు.


Tags:    

Similar News