Bjp : బీజేపీ కోర్ కమిటీ అత్యవసర సమావేశం

భారతీయ జనతా పార్టీ తెలంగాణ పార్టీ నేతలు నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు

Update: 2022-02-23 04:39 GMT

భారతీయ జనతా పార్టీ తెలంగాణ పార్టీ నేతలు నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ ఇన్ చార్జి తరుణ్ చుగ్ పాల్గొననున్నారు. అకస్మాత్తుగా ఈ సమావేశాన్ని నిర్వహించడం వెనక ముఖ్య కారణం మీడియా విషయంలో చర్చించడానికే అంటున్నారు.

అందుకోసమే....
తెలంగాణలో ఉన్న ఒక ప్రధాన పత్రిక, టీవీ ఛానల్ ప్రధానితో పాటు బీజేపీపై అసత్య ప్రచారం చేస్తుందని, దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై బీజేపీ నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ , డీకే అరుణ, మనోహర్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రధానిపై టీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.


Tags:    

Similar News