మోదీ పర్యటనలో జంక్ సైరన్
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న సమయంలో భారత రాష్ట్ర సమితి ఆందోళనలకు పిలుపు నిచ్చింది.
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న సమయంలో భారత రాష్ట్ర సమితి ఆందోళనలకు పిలుపు నిచ్చింది. జంక్ సైరన్ మోగించాలని నిర్ణయించింది. సింగరేణి బొగ్గు గనులను ప్రయివేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండం ప్రాంతాల్లో కార్మికులతో పాటు టీబీజేకేఎస్, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి.
వెనక్కు తీసుకోవాల్సిందే...
మోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నట్లుగానే బొగ్గు గనుల వేలాన్ని ప్రయివేటు వారికి అప్పగించే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి ప్రయివేటీకరిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనలను తెలియజేస్తున్నారు. బీజేపీ హఠావో.. సింగరేణి బచావో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.