Telangana : ఆరోజు ఆటోలు అంతటా బంద్.. ఎందుకంటే?

తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగనున్నారు. ఈ నెల 16వ తేదీన ఆటోలు బంద్ చేయాలని నిర్ణయించారు

Update: 2024-02-07 08:26 GMT

తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగనున్నారు. ఈ నెల 16వ తేదీన ఆటోలు బంద్ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆటోలను బంద్ చేస్తున్నట్లు అసోసియేషన్ నిర్ణయించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో తమకు ఉపాధి కరువైందని వారు గత కొంతకాలంగా వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు.

ఉచిత ప్రయాణంతో...
మంత్రులను, అధికారులను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కావడంతో ఆ పథకం అమలును ఆపడం మాత్రం కుదరదు. తమ కుటుంబ పోషణ కూడా కష్టమైందని, ప్రభుత్వమే ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేసేందుకు ఈ నెల 16న ఆటోలు బంద్ చేయాలని నిర్ణయించారు. ఆ రోజు ఒక్క ఆటో కూడా నడకూడదని సమావేశంలో డిసైడ్ అయ్యారు.


Tags:    

Similar News