ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి
ఓ వివాదాన్ని సద్దుమణిగేలా చేయాలని ప్రయత్నించిన మహిళ ఎస్సైపై ఓ వ్యక్తి దాడికి తెగబడ్డాడు.
ఓ వివాదాన్ని సద్దుమణిగేలా చేయాలని ప్రయత్నించిన మహిళ ఎస్సైపై ఓ వ్యక్తి దాడికి తెగబడ్డాడు. మహిళా ఎస్సై ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించడంతో అదే స్థాయిలో ఎస్సైపై ఆ వ్యక్తి దాడి చేశాడు. శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లాడ మండలానికి చెందిన రాయల రాము అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి చౌదరి హోటల్ కు వెళ్ళాడు. వారు చెప్పిన ఐటమ్స్ లేవని సమాధానం రావడంతో హోటల్ యజమాని, సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. ఇరురుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఇంతలో హోటల్ నిర్వాహకుడు కల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్.ఐ హరిత సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గొడవను నిలువరించే ప్రయత్నం చేసింది. ఈక్రమంలో మహిళా ఎస్సై హరిత, రాముకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్సై పట్ల రాము దురుసుగా ప్రవర్తించడంతో ఎస్సై రామును చెంపదెబ్బ కొట్టింది. దీనితో రాము కూడా ఎస్ఐ పై దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.