జానారెడ్డి ఎందుకు వెళ్లిపోయారు?

తన ప్రసంగం పూర్తయిన వెంటనే జానారెడ్డి మునుగోడులో కాంగ్రెస్ సభ నుంచి వెళ్లిపోయారు

Update: 2022-08-05 14:13 GMT

మునుగోడు సభ జరిగింది. పర్లేదు కొంత జనం హాజరయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభకు అందరు నేతలు వచ్చారు. సీనియర్ నేత జానారెడ్డి కూడా వచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందని భావిస్తున్న సమయంలో అదే జిల్లాకు చెందిన జానారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై వ్యాఖ్యానిస్తారనుకున్నారు. కానీ జానారెడ్డి తన పది నిమిషాల ప్రసంగంలో వారి పేరే ఎత్తలేదు. వారి ఊసే లేకుండా ప్రసంగించడం చర్చనీయాంశమైంది. చరిత్ర చెప్పి ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

ప్రసంగం ముగించుకుని....
తన ప్రసంగం పూర్తయిన వెంటనే జానారెడ్డి సభ నుంచి వెళ్లిపోయారు. తనకు వేరే పని ఉందని వెళ్లి పోయి ఉండవచ్చు. కానీ అసలు కారణం అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ను దూషిస్తుండటాన్ని తాను వినలేక వెళ్లిపోయారని కొందరు పార్టీలోని నేతలు అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తో విరోధం పెట్టుకోవడం ఎందుకనుకున్నారో ఏమో జానారెడ్డి తన ప్రసంగం ముగించుకుని సభా వేదికపై నుంచి వెళ్లిపోయారు. నల్లగొండ జిల్లాలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చేసిన జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ గా బేదాభిప్రాయాలున్నా ఇద్దరూ ఒకటేనంటారు. అందుకే పెద్దగా తాను ఉండి వారిని దూషిస్తున్న సభలో ఉండకూడదనుకున్నారో ఏమో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగించడానికి ముందే సభ నుంచి వెళ్లి పోవడం చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News