Telangana : నేడు సాగర్ కు మిస్ వరల్డ్ పోటీలు

తెలంగాణలో గత రెండు రోజులగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి.

Update: 2025-05-12 02:40 GMT

తెలంగాణలో గత రెండు రోజులగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు నాగార్జున సాగర్  కు పోటీ దారులు రానున్నారు.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నేడు సాగర్ కు వచ్చి అక్కడ బుద్ధవనాన్ని సందర్శిస్తారు.

పాస్ లు ఉన్న వారికి మాత్రమే...
మిస్ వరల్డ్ పోటీలకు దాదాపు 121 మంది నుంచి అందాల మణులు హాజరవుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలను చూసేందుకు ఆసక్తికరంగా ప్రజలు వస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్ లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. అందాల భామలు తెలంగాణలో కనువిందు చేయనున్నారు.


Tags:    

Similar News