Breaking : హరీశ్ రావుపై మరో కేసు నమోదు
బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై మరో కేసు నమోదయింది. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు
బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై మరో కేసు నమోదయింది. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్ రావు తమను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే హరీశ్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ముందస్తు బెయిల్ న్యాయస్థానం నుంచి తెచ్చుకున్నారు.
బెదిరింపుల కేసు...
తాజాగా బెదిరింపు కేసులు హరీశ్ రావుపై నమోదయింది. ఇటీవల జైలు నుంచి విడుదలయిన హరీశ్ రావు అనుచరులపై కూడా బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్ రావు బెదిరింపులకు పాల్పడ్డారంటూ కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యప్తు చేస్తున్నారు. మరో కేసు నమోదు చేయడంతో హరీశ్ రావు మరోసారి కోర్టును ఆశ్రయించే అవకాశముంది.