కవితపై విష్ణు సెటైర్.. బిర్యానీ రివ్యూలు చేస్తున్నారంటూ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై ఆంధ్రప్రదేశ్ బీజేపి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి సెటైర్ వేశారు

Update: 2025-06-26 07:47 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై ఆంధ్రప్రదేశ్ బీజేపి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి సెటైర్ వేశారు. కవిత కొత్త వ్యాపారం ప్రారంభించినట్లుందని ఎక్స్ లో ట్వీట్ చేశారు. కవిత ప్రస్తుతం రాజకీయాలు మానేసి ఇప్పుడు బిర్యానీ రివ్యూలు చేస్తున్నారంటూ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలను విడగొట్టి లబ్దిపొందాలన్న ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తున్నట్లుందని అన్నారు.

రెండు రాష్ట్రాల ప్రజలతో...
ఆంధ్రా – తెలంగాణ పేరుతో ప్రజలను ఇంకా ఎన్నాళ్లకు విడదీసి రాజకీయం చేస్తారంటూ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్ళుంటే మీకు ఎందుకు అంత చులకన భావమని నిలదీశారు. ఒక క ప్రాంతాన్ని అవమానించి మీరు సాధించేది ఏమిటని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇటువంటివి మానుకుని తెలంగాణ ప్రజల సమస్యలపై దృష్టి పెడితే మంచిదని విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు.


Tags:    

Similar News